KTR | ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. అక్రమ అరెస్టులపై కేటీఆర్
KTR | ఈ నెల 27న జరగనున్న కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR | కూకట్‌పల్లిలో ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కాంగ్రెస్ సర్కార్ వెంటనే రద్దు చేయాలని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు నిరసిస్తూ అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించగా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ అక్రమ అరెస్టులను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర ప్రజాప్రతినిధులను, అఖిలపక్ష నాయకులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి. నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదన్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం కాదన్నారు.
ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
ప్రజా సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర ప్రజాప్రతినిధులను, అఖిలపక్ష నాయకులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి.
నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం కాదు.
ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.
అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు.
— KTR (@KTRBRS) November 25, 2026
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. అక్రమ అరెస్టులపై కేటీఆర్
MLC voters | నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్
Ramayana | 99వ ఆస్కార్ రేసులో ‘రామాయణం’.. ‘డ్యూన్ 3’, ‘అవెంజర్స్’ సినిమాలతో పోటీ పడుతున్న ఇండియన్ ఎపిక్!
బాధితులకు మున్సిపల్ చైర్పర్సన్ అనిత పరామర్శ
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

