Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Aaruguru Pathivrathalu | తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన కథాంశాలతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ కూడా ఒకటి.
Aaruguru Pathivrathalu | తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన కథాంశాలతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ కూడా ఒకటి. సుమారు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ బోల్డ్ కామెడీ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి సంచలనం సృష్టించింది. తనదైన కథ, కామెడీ, బోల్డ్ కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ కల్ట్ మూవీని మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
గతంలో అక్టోబర్ నెలలో ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా మళ్లీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు తెరదించుతూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమాను మరోసారి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈసారి ప్రేక్షకుల ముందుకు 4K వెర్షన్లో తీసుకొస్తుండటం మరో విశేషం. దీంతో అప్పట్లో థియేటర్లలో సినిమా చూసినవారు మరోసారి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం ఉండగా, అప్పట్లో చూడలేకపోయిన కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది.
‘ఆరుగురు పతివ్రతలు’ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. దాదాపు 40 మంది కొత్తవారిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. అమృత, లహరి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బోల్డ్ కామెడీతో పాటు అప్పటి సమాజంలోని వైవాహిక సంబంధాలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథలో భాగంగా చూపించడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలిచింది. విడుదల సమయంలో చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం కాలక్రమేణా ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

