సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
సమాచార శాఖలో పని చేస్తున్న సాంస్కృతిక కళాకారునికి వేధింపులు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార శాఖలో సాంస్కృతిక కళాకారులుగా పని చేస్తున్న పలువురు కళాకారులు వారి జీతం కోసం ప్రతి నెల డీపీఆర్ఓకు...
– భద్రాద్రి కొత్తగూడెం డీపీఆర్‌ఓపై ఫిర్యాదు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 : సమాచార శాఖలో పని చేస్తున్న సాంస్కృతిక కళాకారునికి వేధింపులు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార శాఖలో సాంస్కృతిక కళాకారులుగా పని చేస్తున్న పలువురు కళాకారులు వారి జీతం కోసం ప్రతి నెల డీపీఆర్ఓకు కొంత సొమ్ములు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షేక్ కౌషల్ అనే మహిళ గత నెలలో ఆమె నెలవారి మామూలు ఇవ్వకపోవడంతో డీపీఆర్ఓ వేధింపులకు గురిచేస్తున్నట్లుగా పేర్కొంది. ఈ వేధింపులు చివరికి లైంగిక వేధింపులుగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో బాధితురాలు స్వయంగా మీడియాకు వెల్లడించింది. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీపీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
Gold prices | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలు దారుల్లో జోష్..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

