Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
Delhi cafe | దేశ రాజధాని ఢిల్లీలో(Delhi)మరో సామూహిక లైంగిక దాడి కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో సోమవారం రాత్రి ఒక కేఫ్‌లో(Delhi cafe) ఓ యువతి(22 )పై ఆమె సహోద్యోగులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Delhi cafe | దేశ రాజధాని ఢిల్లీలో(Delhi)మరో సామూహిక లైంగిక దాడి కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో సోమవారం రాత్రి ఒక కేఫ్‌లో(Delhi cafe) ఓ యువతి(22 )పై ఆమె సహోద్యోగులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు పనిచేస్తున్న కేఫ్‌లోనే నిందితులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు అనుమానితులు పరారీలో ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే..సోమవారం రాత్రి, బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి ప్రీత్ విహార్‌లోని సల్తానాతే కేఫ్‌లో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యారు. రాత్రి 11:30 గంటలకు కేఫ్ మూసివేసిన తర్వాత వారిలో ఒకరి వద్ద కేఫ్ తాళం చెవి ఉండటంతో తెరిచారు. అర్ద రాత్రి వరకు మద్యం తాగారు. అయితే పార్టీ సమయంలో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడగా, బృందంలోని మిగతావారు వారికి సహకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
Gold prices | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలు దారుల్లో జోష్..!
Vishwambara | సంక్రాంతి బరిలో మెగాస్టార్ విశ్వంభర.. కాకాతో పోటీ తప్పదా?
రూ.86 వేల iQOO 16 ఫోన్ మలేషియాలోకి.. భారత్‌లో లాంచింగ్ ఎప్పుడో!!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

