Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
గర్భిణులకు వచ్చే కొన్ని అంటువ్యాధులు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మీజిల్స్ (తట్టు) వైరస్ గర్భిణి నుంచి గర్భంలోని శిశువుకు వ్యాపిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇటీవల పుట్టుకతోనే మీజిల్స్ సోకిన శిశువుల కేసులు నమోదవుతుండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Measles | గర్భిణులకు వచ్చే కొన్ని అంటువ్యాధులు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మీజిల్స్ (తట్టు) వైరస్ గర్భిణి నుంచి గర్భంలోని శిశువుకు వ్యాపిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇటీవల పుట్టుకతోనే మీజిల్స్ సోకిన శిశువుల కేసులు నమోదవుతుండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి సెప్టెంబర్ చివరి వరకు అమెరికాలో ఇలాంటి 13 కేసులు నమోదైనట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. గర్భిణుల్లో మీజిల్స్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు కూడా 112 నమోదయ్యాయి. వీరిలో చాలామంది గతంలో టీకా తీసుకోనివారు లేదా వారి టీకా వివరాలు తెలియనివారు కావడం గమనార్హం.
ఎంఎంఆర్ టీకా ఉత్తమ మార్గం..
గతంలో మీజిల్స్ వ్యాప్తిని టీకాల ద్వారా చాలావరకు నియంత్రించగలిగారు. అయితే ఇటీవలి కాలంలో టీకాలపై అపోహలు, టీకాలు తీసుకునేవారి సంఖ్య తగ్గడం వల్ల వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత 25 ఏళ్లలో మీజిల్స్ బారిన పడని, టీకాలు కూడా తీసుకోని ప్రసవ వయసులో ఉన్న మహిళల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గర్భధారణకు ముందే మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఎంఎంఆర్ టీకా తీసుకోవడం ఉత్తమమైన నివారణ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి శరీరంలో ఏర్పడే ప్రతిరక్షకాలు మాయ ద్వారా బిడ్డకు చేరి పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తాయి.
ఎప్పుడు టీకా తీసుకోకూడదు..?
అయితే గర్భధారణ సమయంలో ఎంఎంఆర్ టీకా తీసుకోకూడదు. టీకా తీసుకోని మహిళకు గర్భధారణ సమయంలో మీజిల్స్ సోకిన వ్యక్తితో పరిచయం ఏర్పడితే, ఆరు రోజుల్లోగా ప్రతిరక్షకాలు కలిగిన ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా ఇన్ఫెక్షన్, దాని వల్ల వచ్చే సమస్యల ముప్పును తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రసవానికి కొద్దిరోజుల ముందు తల్లికి మీజిల్స్ సోకితే బిడ్డకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తల్లులకు పుట్టే శిశువుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని వైద్య నిపుణుల అంచనా.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
గర్భంలో ఉన్నప్పుడే వైరస్ సోకి, పుట్టిన వెంటనే లక్షణాలు కనిపిస్తే దానిని పుట్టుకతో వచ్చే మీజిల్స్గా పరిగణిస్తారు. జ్వరం, కామెర్లు, చర్మంపై దద్దుర్లు ప్రధాన లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో న్యుమోనియా, మెదడు వాపు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎస్ఎస్పీఈ అనే అరుదైన మెదడు వ్యాధి కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది మీజిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత కనిపించి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. సమాజంలో కనీసం 95 శాతం మందికి ఎంఎంఆర్ టీకాలు అందితే వ్యాధి వ్యాప్తి ముప్పు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం, గర్భధారణకు ముందే టీకా స్థితిని వైద్యుల ద్వారా తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

