బాధితులకు మున్సిపల్ చైర్పర్సన్ అనిత పరామర్శ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్లో గల దుర్గా వైన్స్ పక్కన ఉన్న ఒక జనరేటర్ నుండి సల్ఫర్ డయాక్సైడ్ లీక్ అవ్వడంతో తీవ్రమైన విష వాయువు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల ప్రజలు అస్వస్థతకు గురై ఖమ్మం నగరంలోని...
ఖమ్మం రూరల్, నవంబర్ 25 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్లో గల దుర్గా వైన్స్ పక్కన ఉన్న ఒక జనరేటర్ నుండి సల్ఫర్ డయాక్సైడ్ లీక్ అవ్వడంతో తీవ్రమైన విష వాయువు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల ప్రజలు అస్వస్థతకు గురై ఖమ్మం నగరంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు. విషయం తెలియగానే ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత వెంటనే హాస్పిటల్ కు చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, మున్సిపాలిటీ తరపున అన్ని విధాలుగా సహాయం చేస్తామని చైర్పర్సన్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Anitha01
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాధితులకు మున్సిపల్ చైర్పర్సన్ అనిత పరామర్శ
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

