Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Food Poison | సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో భోజనం వికటించింది. ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
Food Poison | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్ల నిర్వహణ ఎలా ఉందో మరోసారి తెలియజేసే ఘటన ఇది.. ఇప్పటికే నాణ్యమైన ఆహారం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో భోజనం వికటించింది. ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం బయటకు రాకుండా సిబ్బంది హాస్టల్ డోర్ పెట్టుకొని మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేయడం గమనార్హం. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ వచ్చి డోర్ కొట్టినా సిబ్బంది అరగంట వరకు తీయకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో క్లారిటీ ఇస్తోంది.
హాస్టల్లో తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

