Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
HelloPrema | 'బేబీ' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి వైష్ణవి చైతన్య, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
‘బేబీ’ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి వైష్ణవి చైతన్య, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. తమిళ స్టార్ హీరో ఆర్య సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘హలో కాదల్’. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం ‘హలో ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ దర్శకుడు నిఖిల్ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మరో కీలక పాత్రలో నిఖిలా విమల్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇందులో భాగంగా తాజాగా ‘హలో ప్రేమ’ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లోని సన్నివేశాలను గమనిస్తే, ఇదొక ఆసక్తికరమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందినట్లు స్పష్టమవుతోంది. ఆర్య, వైష్ణవి చైతన్య, నిఖిలా విమల్ మధ్య సాగే ప్రేమ, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగులో ‘బేబీ’తో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి చైతన్యకు, ఈ డబ్బింగ్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

