విమానంలో తోటి ప్రయాణికుడిపై వ్యక్తి పిడిగుద్దులు.. బెల్టుతో గొంతు నొక్కేందుకు యత్నం
Man Punches Co-Passenger On Flight | విమానం గాలిలో ఉండగా ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు బెల్టుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నించాడు. బాధిత ప్రయాణికుడి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: విమానం గాలిలో ఉండగా ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు బెల్టుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నించాడు. బాధిత ప్రయాణికుడి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Punches Co-Passenger On Flight) మంగళవారం సాయంత్రం వేళ ఇండిగో విమానం అబుదాబి నుంచి కొచ్చికి వస్తున్నది. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు అందులో ప్రయాణించారు.
కాగా, ఆ విమానం గాలిలో ఉండగా వైట్టిలాకు చెందిన రోషన్ మార్టిన్, ముందు వరుస సీటులో కూర్చొన్న త్రిసూర్‌కు చెందిన యూసుఫ్‌పై దాడి చేశాడు. అతడి ముఖంపై పంచ్‌లు ఇచ్చాడు. అంతేగాక మార్టిన్ తన సీటు బెల్ట్ తీసి యూసుఫ్ మెడ చుట్టూ బిగించి అతడి గొంతు నొక్కేందుకు ప్రయత్నించాడు. మార్టిన్ దాడిలో యూసఫ్ కుడి కంటి వద్ద గాయమైంది. అతడి కళ్లద్దాలు పగిలాయి. ఈ సంఘటన ఆ విమానంలో కలకలం రేపింది.
మరోవైపు ఆ ఇండిగో విమానం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే తనపై దాడి చేసిన రోషన్ మార్టిన్‌పై పోలీస్ స్టేషన్లో యూసఫ్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మార్టిన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Choke
- Co-Passenger
- flight
- indigo
RELATED ARTICLES
తాజా వార్తలు
విమానంలో తోటి ప్రయాణికుడిపై వ్యక్తి పిడిగుద్దులు.. బెల్టుతో గొంతు నొక్కేందుకు యత్నం
Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
Vitamin B12 | జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు.. విటమిన్ బి12 చేస్తున్న అద్భుతాలు..
Free Bus | ఫ్రీ బస్సు నో యూస్.. పక్క రాష్ట్రాల బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు
KTR | ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. అక్రమ అరెస్టులపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

