Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
Professor Teja Sri | లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ తేజశ్రీ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Professor Teja Sri | మహిళా ప్రొఫెసర్లను వేధిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారని తెలిసిందే. ప్రొఫెసర్ తేజశ్రీ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షలో తేజ శ్రీని బలవంతంగా అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు.
అల్డాస్ జానయ్య వేధింపుల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన కూడా నిర్వహించగా.. మరోవైపు తేజశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి లక్ష్మీముసారాంబాగ్లో నిరాహార దీక్ష చేపట్టారు. తన కూతురికి న్యాయం చేయాలని.. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై FIR నమోదు చేయాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మూడో రోజుకు చేరిన ప్రొఫెసర్ తేజశ్రీ నిరాహార దీక్ష
రోజురోజుకి క్షీణిస్తున్న తేజశ్రీ ఆరోగ్యం.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ మూడో రోజు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తేజశ్రీ
ఆమెను బలవంతంగా అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలింపు
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2026
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
విమానంలో తోటి ప్రయాణికుడిపై వ్యక్తి పిడిగుద్దులు.. బెల్టుతో గొంతు నొక్కేందుకు యత్నం
Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
Vitamin B12 | జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు.. విటమిన్ బి12 చేస్తున్న అద్భుతాలు..
Free Bus | ఫ్రీ బస్సు నో యూస్.. పక్క రాష్ట్రాల బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

