‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని ఆమె జిల్లా పశువైద్య సంవర్ధశాఖ అధికారి...
– నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి
కట్టంగూర్, నవంబర్ 25 : పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని ఆమె జిల్లా పశువైద్య సంవర్ధశాఖ అధికారి వి.రమేశ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పశువులకు సకాలంలో వైద్యం, అవసరమైన పోషకాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచుకోచ్చన్నారు. పాడి రైతులకు అండగా నిలవడంతో పాటు పశువుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. 19 గేదెలకు గర్భ సంబంధిత వ్యాధులకు చికిత్స చేసి 20 గేదెలకు పరీక్షలు నిర్వహించి ఎద టాబ్లెట్స్ అందజేశారు. పాల ఉత్పతిని పెంపొందించేందుకు మినరల్ మిక్చర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుల్లి నరేశ్, ఉప సర్పంచ్ మల్లేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారు కృష్ణ, పశువైధికారి రవి, ఎల్ఎస్ఏ అరుణ, సిబ్బంది కిరణ్, గోపాలమిత్ర యాదయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!
Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
విమానంలో తోటి ప్రయాణికుడిపై వ్యక్తి పిడిగుద్దులు.. బెల్టుతో గొంతు నొక్కేందుకు యత్నం
Alias Rukmini | బాక్సాఫీస్ పోటీని తట్టుకునేందుకు నాని, నితిన్ వ్యూహం.. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్స్ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

