Russian oil tanker | చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్.. దారి మళ్లి భారత్‌కు ప్రయాణం
Russian oil tanker | చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచడంతో ఈ పరిణామం జరిగింది.
న్యూఢిల్లీ: చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచడంతో ఈ పరిణామం జరిగింది. (Russian oil tanker) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ‘ఆక్వా టైటాన్’ అనే రష్యా చమురు నౌక జనవరి చివరలో బాల్టిక్ పోర్ట్‌లో క్రూడ్ ఆయిల్ లోడ్ చేసుకున్నది. చైనాలోని రిజావో పోర్టులో అన్లోడింగ్ కోసం బయలుదేరింది.
కాగా, అమెరికా- ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది.
మరోవైపు దేశంలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా వైపు వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ ‘ఆక్వా టైటాన్’ దారి మళ్లింది. దక్షిణ చైనా సముద్రంలో యూ టర్న్ తీసుకున్నది. భారత్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నది. మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనున్నది.
కాగా, మరో రష్యా ట్యాంకర్ కూడా భారత్ వైపు తన మార్గాన్ని మార్చుకున్నది. కజఖ్ సీపీసీ బ్లెండ్ ముడి చమురును రవాణా చేస్తున్న సూయజ్‌మాక్స్ నౌక ‘జౌజౌ ఎన్’ భారత పశ్చిమ తీరంలోని సిక్కాను తన గమ్యస్థానంగా సూచిస్తున్నది. మార్చి 25న ఇది అక్కడకు చేరుకుంటుందని షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తున్నది.
అయితే ఇటీవల రష్యా ముడి చమురును చైనాకు రవాణా చేస్తున్న ఏడు ఆయిల్ ట్యాంకర్లు మార్గమధ్యలో ఇలా దారి మళ్లాయని ఇంధన నిఘా సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ అంచనా వేసింది. భారత్‌లోని అన్ని ప్రధాన రిఫైనరీలు ఇప్పుడు రష్యా ముడి చమురు కోనుగోలుకు భారీగా ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది.
Also Read:
LPG carrier | ఇండియాకు చేరుకున్న ‘నందా దేవి’.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్ వచ్చిన నౌక
Indore Fire Blast | ఈవీ కారుకు మంటలు, పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఏడుగురు సజీవ దహనం
Watch: బైక్ రేస్‌లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

