సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
విజయపురి సౌత్ పరిధిలోని నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి బృందం శుక్రవారం పరిశీలించింది. జలాశయ నిబంధనలకు విరుద్ధంగా ఇంటెక్ వెల్ సంపు నిర్మాణ పనులు జరుగుతున్నాయంటూ...
నాగార్జున సాగర్, నవంబర్ 20 : విజయపురి సౌత్ పరిధిలోని నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి బృందం శుక్రవారం పరిశీలించింది. జలాశయ నిబంధనలకు విరుద్ధంగా ఇంటెక్ వెల్ సంపు నిర్మాణ పనులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రైట్ బ్యాంక్ లో బ్యాక్‌వాటర్ ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల తీరును వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీశారు. ఇంటెక్ వెల్ సంపు నిర్మాణంతో నాగార్జునసాగర్ జలాశయ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా అనే కోణంలోనూ పరిశీలన చేశారు. నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు అనుసరిస్తున్న విధానంపై శ్యాం ప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు.

సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
జలాశయ పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఉన్న నిబంధనలు, అనుమతులపై అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు భద్రతకు విఘాతం కలిగించేలా ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు జలాశయ భద్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇంటెక్ వెల్ సంపు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు, అనుమతులు, నిబంధనలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు రిటైర్ ఇంజనీర్ల బృందంతో శ్యాం ప్రసాద్ రెడ్డి తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్ లిఫ్టు ప్రాజెక్టును సందర్శించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

