Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీనియర్ విద్యా ర్థుల దాడులు ఆగడం లేదు.
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీనియర్ విద్యా ర్థుల దాడులు ఆగడం లేదు. గతంలో జూనియర్లపై బ్యాట్లు, వికెట్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరోసారి ఎనిమిదో తరగతి విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు కట్టెలతో దాడి చేశారు. ఎన్సీసీ పరేడ్‌కు షూలు వేసుకురాలేదనే కారణంతో ముగ్గురు విద్యార్థులను చితకబాదడంతో కాళ్లు, చేతులు, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. నవంబర్ 16న సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజాపేట గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ దాడిలో గాయపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోగా మరోసారి దాడి జరగడం పాఠశాల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఘటనపై నవంబర్ 17న క్రమశిక్షణ కమిటీ ఇరువర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించి విచారించి కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం శుక్రవారం తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 17న క్రమశిక్షణ కమిటీ సమావేశమై సంబంధిత విద్యార్థులు, బాధితులు, వారి తల్లిదండ్రులను విచారించినట్లు వెల్లడించింది.
వారం రోజుల పాటు సస్పెండ్
అనంతరం దాడికి పాల్పడిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించి, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి పంపించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యమని, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేసింది. అయితే గురుకులంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, గత ఘటనపైనా సమీక్షించి విద్యార్థుల భద్రతకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

