Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
Negligence | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అధికారుల వ్యవహారశైలి వివాదానికి దారితీస్తోంది.
మాగనూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Houses ) ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అధికారుల వ్యవహారశైలి వివాదానికి దారితీస్తోంది. మాగనూరు మండలం మందిపల్లి గ్రామంలో సర్పంచు ( Srpanches ) కు కనీస సమాచారం, ఆహ్వానం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడంపై బీఆర్ఎస్ సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ప్రజల చేత ఎన్నికైన సర్పంచును పక్కనపెట్టి, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మంత్రి స్థాయి నుంచి సర్పంచుల స్థాయి వరకు ప్రజాప్రతినిధుల గౌరవం, స్థానిక పాలన ప్రాధాన్యత గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు గ్రామ సర్పంచులను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాల్సిన అధికారులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కల నెరవేర్చే ప్రతిష్టాత్మక కార్యక్రమం కాగా, దాని ప్రారంభోత్సవాల్లోనే ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు, ఆహ్వానాల వివాదాలు తలెత్తడం ప్రభుత్వ పాలన తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

