నీళ్లిచ్చి.. పంటలు కాపాడండి
గణపురం మండలం గణపసముద్రం చెరువు ఆయకట్టుకు కోట, మత్తడి కాల్వల ద్వారా నీళ్లు వదిలి తమ పంటలు కాపాడాలని రైతులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బాబురావుతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ గత జూన్ చివరి వారంలో వరి పంట సాగుకు కాల్వల ద్వారా అధికారికంగా నీళ్లు వదిలారని, జూలై 17 నుంచి నిలిపివేయడంతో పోసిన వరి నారుమడులు, నాట్లు పడిన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
- గణపసముద్రం ఆయకట్టు రైతుల వేడుకోలు
- భూపాలపల్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేత
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : గణపురం మండలం గణపసముద్రం చెరువు ఆయకట్టుకు కోట, మత్తడి కాల్వల ద్వారా నీళ్లు వదిలి తమ పంటలు కాపాడాలని రైతులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బాబురావుతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ గత జూన్ చివరి వారంలో వరి పంట సాగుకు కాల్వల ద్వారా అధికారికంగా నీళ్లు వదిలారని, జూలై 17 నుంచి నిలిపివేయడంతో పోసిన వరి నారుమడులు, నాట్లు పడిన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులు గణపసముద్రం నీటిని విడుదల చేస్తేనే తామంతా నారు పోశామన్నారు. గణపురంలోని 90 శాతం రైతు కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, వరి సాగే జీవనాధారమన్నారు. మిషన్ భగీరథ పనుల సమయంలో రామప్ప సరస్సు నుంచి దేవాదుల పైపులైన్ ద్వారా నీరందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
ప్రస్తుతం రామప్పలో తగినంత నీరున్నప్పటికీ గణపసముద్రం చెరువుకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కిసాన్ మేళాలో వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు తాము 125-130 రోజుల్లో చేతికొచ్చే వరి పంట వేశామని, మరో మూడు నెలల పాటు నిరంతరాయంగా సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సొంత మండలమైన గణపురానికి చెందిన రైతులు సాగునీటి కోసం తండ్లాడడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

