Fire Accident : రన్నింగ్ బస్సు (Runnig Bus) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. మహారాష్ట్ర (Maharastra) లోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే (Mumbai-Pune Express way) పై పుణె (Pune) వైపు వెళ్లే మార్గంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Khalapur, Maharashtra | A bus caught fire on the Pune-bound lane of the Mumbai-Pune Expressway. Fire brigade teams from the Panvel Municipal Corporation and Khopoli Municipal Council rushed to the spot and brought the blaze under control. There were 14 passengers on… pic.twitter.com/ONfSuVJXke
— ANI (@ANI) September 24, 2026