ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయం!
కరోనా మహమ్మారి నేపథ్యంలో తగ్గిన బ్యాంక్ రుణాల వడ్డీరేట్లకు అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లు పడిపోయాయి. అప్పట్నుంచి సంప్రదాయ మదుపర్లు సేఫ్ జోన్లో అధిక వడ్డీ ఆదాయం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.
- మదుపర్లకు అధిక వడ్డీరేట్లు
- గల్ఫ్ యుద్ధం, ద్రవ్యోల్బణం దృష్ట్యా అంచనాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కరోనా మహమ్మారి నేపథ్యంలో తగ్గిన బ్యాంక్ రుణాల వడ్డీరేట్లకు అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లు పడిపోయాయి. అప్పట్నుంచి సంప్రదాయ మదుపర్లు సేఫ్ జోన్లో అధిక వడ్డీ ఆదాయం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు గత నెల జూలైకిగాను ఇంకా విడుదల కాలేదు. కానీ అంతకుముందు నెల జూన్‌లో 4.38 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ పెట్టుకున్న 4 శాతం పరిమితిని ఇది మించిపోయింది.
ద్రవ్య సమీక్షలో..
ఈ వారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరుగనున్నది. అయితే ఇందులో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉంటాయి. కానీ పశ్చిమాసియా సంక్షోభం, ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్ల పెంపు తప్పదన్న అభిప్రాయాలున్నాయి. ఫలితంగా బ్యాంకులూ వడ్డీరేట్లను పెంచేందుకే వీలున్నది. దీంతో ఎఫ్‌డీలపైనా వడ్డీరేట్లు పెరుగడం ఖాయమే అని చెప్పవచ్చు. తొలుత స్వల్పకాలిక డిపాజిట్లు, ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఎఫ్డీ రేట్లు పెరుగుతాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.
అంతకంతకూ విజృంభణ
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. నిరుడు అక్టోబర్‌లో 0.25 శాతంగా ఉంటే.. ఈ ఏడాది జూన్‌లో 4.38 శాతానికి పెరిగాయి. దీనికితోడు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల పెంపు తప్పదన్న అంచనాలు గట్టిగానే నెలకొన్నాయి. కాగా, రుణాల డిమాండ్, డిపాజిట్ల వృద్ధిలో మందగమనం, పదేండ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడులు, చిన్న మొత్తాల ఆకర్షణీయ వడ్డీరేట్లు కూడా ఎఫ్డీలపై వడ్డీరేట్ల పెంపునకు దోహదం చేస్తాయని అంటున్నారు.
ఇదీ సంగతి..
మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న ఒడిదుడుకులు.. మదుపర్లను బెంబేలెత్తిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు, డెట్ మార్కెట్లు, బంగారం-వెండి, కరెన్సీ, కమోడిటీ మార్కెట్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి మరి. ఈ పరిస్థితులు సురక్షిత పెట్టుబడి సాధనాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషించేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా కనిపిస్తున్నవి ఫిక్స్డ్ డిపాజిట్లే. కానీ దేశ జీడీపీ వృద్ధిరేటు గురించి ఆలోచిస్తున్న ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నా ఓపికతోనే ఉంటున్నది. అయితే ప్రతికూల పరిస్థితులు వడ్డీరేట్ల పెంపునకే ఆర్బీఐని ఉసిగొల్పుతున్నాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో బ్యాంకులు ఆయా కాలపరిమితుల ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచేందుకు వీలుందంటున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు
నెల ద్రవ్యోల్బణం
- అక్టోబర్ = 0.25%
- నవంబర్ = 0.71%
- డిసెంబర్ = 1.33%
- జనవరి = 2.74%
- ఫిబ్రవరి = 3.21%
- మార్చి = 3.40%
- ఏప్రిల్ = 3.48%
- మే = 3.93%
- జూన్ =4.38%
ఎఫ్డీలపై అధిక వడ్డీరేట్లిస్తున్న టాప్-10 బ్యాంకులు
బ్యాంక్ వడ్డీరేటు
- డీసీబీ = 7.50%
- బంధన్ = 7.45%
- సీఎస్బీ = 7.35%
- జమ్ము&కశ్మీర్ = 7.30%
- ఎస్బీఎం = 7.30%
- బీవోఐ = 6.85%
- పీఅండ్ఎస్ = 6.85%
- ఇండియన్ = 6.80%
- బీవోబీ = 6.75%
- సెంట్రల్ = 6.70%

2
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

