Official with Accused Astrologer | అత్యాచార నిందితుడైన జ్యోతిష్కుడికి.. గొడుగు పట్టిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్
Official with Accused Astrologer | పలువురు మహిళలపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్కుడైన అశోక్ ఖరత్‌తో ఒక మహిళా అధికారిణికి ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రూపాలి చకన్కర్ ఆ జ్యోతిష్కుడికి గొడుగు పట్టిన ఫొటో వైరల్ అయ్యింది.
ముంబై: పలువురు మహిళలపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్కుడైన అశోక్ ఖరత్‌తో ఒక మహిళా అధికారిణికి ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రూపాలి చకన్కర్ ఆ జ్యోతిష్కుడికి గొడుగు పట్టిన ఫొటో వైరల్ అయ్యింది. (Official with Accused Astrologer) అశోక్ ఖరత్ ట్రస్ట్‌తో ఆ అధికారిణికి సంబంధం ఉన్నట్లు కూడా బయటపడింది.
కాగా, జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో తన సంబంధం పరిమితమని, ఆయనపై ఆరోపించిన నేరాల గురించి తనకు ఏమీ తెలియదని రూపాలి తెలిపారు. సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా ఎలాంటి నిర్ధారణలకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్టం దాని పనిని అది చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
మరోవైపు రూపాలి చకన్కర్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అశోక్ ఖరత్, ఆయన ట్రస్ట్‌తో ఆమెకు ఉన్న సంబంధంపై విచారణ జరుపాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ దీనిపై స్పందించారు. ‘ఇవి రెండు వేర్వేరు అంశాలు. లైంగిక వేధింపుల కేసు విచారణలో ఉన్నది. దానిని క్షుణ్ణంగా విచారిస్తాం. ట్రస్టీగా ఆమె పాత్రలో ఏదైనా చట్టవిరుద్ధం ఉంటే దానిని కూడా పరిశీలిస్తాం’ అని మీడియాతో అన్నారు.
కాగా, పదవీ విరమణ పొందిన మర్చంట్ నేవీ అధికారి అశోక్ ఖరత్ ప్రముఖ జ్యోతిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. 35 ఏళ్ల మహిళపై మూడేళ్లకు పైగా పలుమార్లు అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై బుధవారం నాసిక్ జిల్లాలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో 58 మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు గుర్తించారు. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే గతంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆ జ్యోతిష్యుడిని సందర్శించారు. తాజాగా అశోక్ ఖరత్‌తో కలిసి రూపాలి చకన్కర్ ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
Also Read:
Veterinarian Dies in Hippo Attack | ఆరోగ్య పరీక్షల సమయంలో నీటి గుర్రం దాడి.. పశువైద్యురాలు మృతి
Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

