డీహెచ్‌లో ఆ ఇద్దరి అక్రమాలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొంది ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఓ అధికారితోపాటు డీహెచ్‌కు డిప్యూటేషన్‌పై వచ్చి ఏవో టు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా తిష్టవేసిన మరో అధికారి కలిసి యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- ప్రతి ఫైలుకు రేట్ ఫిక్స్ చేసి, అడ్డగోలుగా అక్రమ వసూళ్లు
- ‘అల్విన్’ నుంచి రీ డిప్లాయ్‌మెంట్ ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా సీనియారిటీ లిస్టు తారుమారు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొంది ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఓ అధికారితోపాటు డీహెచ్‌కు డిప్యూటేషన్‌పై వచ్చి ఏవో టు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా తిష్టవేసిన మరో అధికారి కలిసి యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే వీరిద్దరు డీహెచ్‌లోని కీలకాధికారితో కుమ్మక్కై డిప్యూటేషన్లు, సరెండర్ కేసులు, ఫారెన్ సర్వీసు డిప్యూటేషన్లు(ఎఫ్‌ఎస్‌డీలు), విజిలెన్స్ ఫైళ్ల క్లియరెన్స్‌కు రేటు ఫిక్స్ చేసి, వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. దీనితోపాటు ఏవో టు అసిస్టెంట్ డైరెక్టర్ పదోన్నతుల్లో సీనియార్టీ లిస్టును తారుమారు చేశారని, కొందరు ఉద్యోగులపై అభియోగాలు మోపడం ద్వారా సీనియారిటీ లిస్టు నుంచి తప్పించి, ప్రమోషన్లను తొక్కిపెడుతున్నారని సొంత శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థ అల్విన్ లిమిటెడ్ నుంచి 1993లో రీ డిప్లాయ్‌మెంట్ కింద మొత్తం 1,486 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరారు. వీరిలో ఎనిమిది మంది డీహెచ్‌లో జాయిన్ అయ్యారు.
దీంతో వారి అర్హతలు, క్యాడర్ ఆధారంగా రీడిప్లాయ్మెంట్ చేయాలని 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 77 విడుదల చేసింది. అల్విన్ నుంచి డీహెచ్‌లో చేరిన వారికి సీనియారిటీ ఫిక్సేషన్ చేయాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రమోషన్లు కల్పించాలని 2010లో డీహెచ్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వీరి ప్రమోషన్లను డీహెచ్‌లో చక్రం తిప్పుతున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు తొక్కిపెట్టడంతో ఆరుగురు ఉద్యోగులు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లునే రిటైరైనట్టు తెలిసింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం డీహెచ్‌లో ఆఫీస్ సూపరింటెండెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో)లుగా ప్రమోషన్లు పొంది, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ల స్థానంలో ఉండాల్సిన వీరి ఫైల్‌ను కూడా డీహెచ్‌లోని ఇద్దరు ఏడీలు తొక్కిపెట్టినట్టు తెలుస్తున్నది.
కోర్టు ఉత్తర్వులున్నా..
ప్రమోషన్లలో తమకు జరిగిన అన్యాయంపై ఈ ఇద్దరు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జీవో 77 ప్రకారం ‘అల్విన్’ నుంచి రీడిప్లాయ్మెంట్ అయిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని, మానిటరీ బెనిఫిట్స్ కల్పించాలని కోర్టు ఆదేశించింది. కానీ, 1993 మే 3న విధుల్లో చేరిన వీరికి 1997 అక్టోబర్ 27 నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా సీనియారిటీ వర్తిస్తుందని డీహెచ్‌లో చక్రం తిప్పుతున్న ఇద్దరు ఏడీలు ఫైల్లో పొందుపర్చినట్టు తెలుస్తున్నది.
‘అల్విన్’ నుంచి డీహెచ్‌కు రీడిప్లాయ్మెంట్ అయిన ఇద్దరు అధికారులు సీనియర్లు కావడంతో తమ దందాకు ఎక్కడ అడ్డుపడతారోనని ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైల్లో మెలిక పెట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యశాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సదరు ఉద్యోగులకు న్యాయం చేయాలని, డీహెచ్‌లో వసూళ్లకు తెగబడుతున్న ఇద్దరు ఏడీలపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

