Karnataka Officer Dies by Suicide | సీనియర్ వేధింపులు తాళలేక.. అధికారి ఆత్మహత్య
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. దేవుడు అతడ్ని శిక్షిస్తాడని పేర్కొన్నాడు.
బెంగళూరు: సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. దేవుడు అతడ్ని శిక్షిస్తాడని పేర్కొన్నాడు. (Karnataka Officer Dies by Suicide) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్, శుక్రవారం సాయంత్రం పావగడలోని ఆ శాఖ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు.
కాగా, ఆత్మహత్యకు ముందు మల్లికార్జున్ ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఆ శాఖ డైరెక్టర్ కృష్ణప్ప తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. తన కుటుంబం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ‘నా తల్లి, భార్య, పిల్లలు.. నా కుటుంబం మొత్తం నన్ను ఎంతో బాగా చూసుకున్నది. వారు నాకు గౌరవం ఇచ్చారు. నేను వారికి సహాయం చేయాల్సి ఉంది. నేను వారికి ఇంకా ఎక్కువగా సహాయం చేయాలనుకున్నా. కానీ అది చేయలేకపోతున్నా’ అని అందులో పేర్కొన్నాడు.
మరోవైపు తన కుటుంబం ప్రతీకారం తీర్చుకోవద్దని మల్లికార్జున్ సూచించాడు. ఆ వ్యక్తిని దేవుడు, చట్టం శిక్షిస్తాయని తెలిపాడు. ‘సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కృష్ణప్ప వేధింపుల వల్లే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడు అతడ్ని శిక్షిస్తాడు. అతడి కుటుంబ సభ్యుల తప్పు ఏమీ లేదు. కాబట్టి, నా కుటుంబ సభ్యులు వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు, చట్టం కచ్చితంగా అతడ్ని శిక్షిస్తాయి’ అని అన్నాడు.
కాగా, ఆత్మహత్యకు ముందు మల్లికార్జున్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను తన సహోద్యోగులకు షేర్ చేశాడు. దీంతో ఆ శాఖలో కలకలం రేపింది. పావగడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Punjab Minister resigned | అధికారి ఆత్మహత్య.. పంజాబ్ మంత్రి రాజీనామా
Ramadoss, Sasikala join hands | తమిళనాడులో కొత్త రాజకీయ కూటమి.. చేతులు కలిపిన రామదాస్, శశికళ
Watch: గ్యాస్ కొరత నేపథ్యంలో.. గ్యాస్ సిలిండర్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

