Abdul Basit | మాపై అమెరికా దాడిచేస్తే మేం భారత్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ దురుసు వ్యాఖ్యలు
Abdul Basit | పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Abdul Basit : పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai) నగరాలపై తాము బాంబు దాడులకు దిగుతామని బాసిత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బాసిత్.. అమెరికా తమపై దాడిచేస్తే, తాము వెంటనే భారత్‌పై దాడి చేస్తామని, ముంబై, ఢిల్లీలను వదిలిపెట్టమని అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని తలబిరుసు వ్యాఖ్యలు చేశారు.
తమ దేశ అణు సంపదను లక్ష్యంగా చేసుకున్నా ఇదే తరహా ప్రతిస్పందన ఉంటుందని అబ్దుల్ బాసిత్ అన్నారు. అయితే ఇది దాదాపు అసాధ్యమైన సందర్భమని అంగీకరిస్తూనే, దీనిని ‘వ్యూహాత్మక ఉన్మాదం’గా అభివర్ణించడం గమనార్హం. 2014 నుంచి 2017 వరకు భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా పనిచేసిన బాసిత్ నుంచి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో భారత్‌ను అనవసరంగా వివాదంలోకి లాగుతూ బాసిత్ మాట్లాడటంపై భారతీయులు మండిపడుతున్నారు.
పాకిస్థాన్ అధికారులకు తమ సమస్యలను పక్కనపెట్టి భారత్‌ను బెదిరించడం అలవాటుగా మారిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

