KTR | క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే : కేటీఆర్
KTR | క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్ : క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు ( Vile Politics ) చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే ( Congress Party ) నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్లం. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం తమకు లేదని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ లాగా పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదని పేర్కొన్నారు.
హరీష్ రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్‌లోనూ ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని ఆరోపించారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి బీఆర్ఎస్ది కాదని అన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్ స్టేషన్‌కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయని విమర్శించారు.
హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి విచారకరం
కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామిక వాదులు గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలని, రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇవ్వలేదని, పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ లోని 10,000 ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్ పైన రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్ ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- congress party
- harish rao
- HYDRA
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

