Secret Deal | ఆంధ్రప్రదేశ్‌తో రేవంత్ ప్రభుత్వం చీకటి ఒప్పందం : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ధ్వజం
Secret Deal | కర్నాటక, తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జూరాలకు భారీగా వరద వస్తోందని , వచ్చిన నీళ్లను వచ్చినట్లే తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఏపీకి వదిలేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : కర్నాటక, తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జూరాలకు భారీగా వరద వస్తోందని , వచ్చిన నీళ్లను వచ్చినట్లే తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఏపీకి వదిలేస్తుందని బీఆర్ఎస్( BRS ) మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్( Jaipal Yadav ), బీరం హర్ష ( Beeram Harsha ) మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వంతో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ( Revanth Government ) చీకటి ఒప్పందం ( Secret Deal ) చేసుకుని, తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ టూర్లపై ఉన్న దృష్టి పాలమూరు రైతులపై లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వర్షాలతో వరద ప్రారంభమైన వెంటనే మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లల్లో నీళ్లను నింపి, రైతులకు సమయానికి నీళ్లను అందించేదని స్పష్టం చేశారు.
జూరాలకు వరద వచ్చి పదిహేను రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రిజర్వాయర్లలో నీళ్లను నింపే ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది తెలంగాణ రైతుల కోసమా? పక్క రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసమా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరినో సంతృప్తి పరచడానికే రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

