బూర్గంపహాడ్ : లారీ ప్రమాదంలో ( Accident ) మృతి చెందిన ఐటీసీపీఎస్పీడీ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుడు గుగులోత్ శ్రీరామ్ ( Sriram ) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు (Family Protests ) దిగారు. విధులు ముగించుకుని వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో ఐటీసీ సమీపంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే శ్రీరామ్ మృతిచెందాడు.
యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న సర్పంచ్ గుగులోత్ కిషోర్నాయక్ ఐటీసీ గేటు వద్ద శ్రీరామ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబానికి అండగా ఉంటానని, ఐటీసీ యాజమాన్యం న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.