కారేపల్లి, సెప్టెంబర్ 28 : నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులతో మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వ్యాసరచన, క్విజ్, పోస్టర్ మేకింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జి.ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థ రహిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఎం.సమీనా కౌర్, ఎం.స్వాతి, జి.అరుణపూర్ణ, బి.రమ, బి.వసంత్ పాల్గొన్నారు.

‘మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి’