Asian Games : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత బృందం తొమ్మిదోరోజూ పతకాలతో మెరిసింది. షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా సింగ్ (Esha Singh) వెండి వెలుగులు విరజిమ్మగా.. ప్రాచీన కురాష్ ఆటలో పింకీ బల్హార(Pincky Balhara) కాంస్యం పట్టేసింది. ఎనిమిదేళ్ల క్రితం.. జకర్తాలో రజత పతకం గెలుపొందిన తను ఈసారి ఐచీ నొగయలో పంజా విసిరింది. ఉడుంపట్టుతో మూడో స్థానంలో నిలిచిన పింకీ కంచుమోత మోగించింది. అయితే.. డిస్కస్ త్రోలో మాత్రం సీమా పూనియాకు చుక్కెదురైంది.
ఐచీ నగోయలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. పసిడి పోరులో వెనకబడినా.. వెండి, కాంస్యం పతకాలతో పోడియం మీద మెరుస్తున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ సిల్వర్ మెడల్ అందుకోగా.. పురాతనమైన కురాష్ ఆటలో పింకీ బల్హారా కాంస్యంతో గర్జించింది.
Pincky Balhara becomes the first Indian athlete to win two career medals in Kurash at the Asian Games, adding a brilliant Bronze in the Women’s -78kg category to her 2018 Silver medal! 🥉💪
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels… pic.twitter.com/zaquknM7mu
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2026
మహిళల 78 కిలోల విభాగంలో అదరగొడుతూ క్వార్టర్ ఫైనల్లోగరమ్ లిమ్‌ను చిత్తు చేసిన పింకీ.. సెమీస్‌లో సుమిమ్ మో చేతిలో కంగుతిన్నది. మోకాలి గాయంతో బాధ పడుతున్న తను గొప్పగా పోరాడినప్పటికీ.. ప్రత్యర్థి మాత్రం మోకాలి మీదే అటాక్ చేసింది. దాంతో.. పింకీ ఓటమితో కాంస్యం గెలచుకుంది. 2018 జకర్తా ఆసియా క్రీడల్లో పింకీ 54 కిలోల విభాగంలో పోటీపడి రజతం ఒడిసిపట్టింది.
మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా తీవ్రంగా నిరాశపరిచింది. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యంతో మెరిసిన తను సోమవారం జరిగిన ఫైనల్లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్వన చేసింది. డిస్కస్ త్రోను ఏకంగా 59.88 మీటర్ల దూరం విసిరింది. కానీ, చివరకు నాలుగో స్థానంతో నిరాశపరిచిందీ స్టార్ అథ్లెట్. ఫలితంగా ఆసియాడ్‌లో పతకం గెలుస్తుందనుకున్న సీమ.. ఈసారి ఉత్త చేతులతోనే స్వదేశం రానుంది.
SEEMA GOT HER PERSONAL BEST — BUT IT WASN’T ENOUGH FOR THE PODIUM.
Seema finished 4th with a PB of 59.88m, improving as the night went on:
53.67m → 58.40m → 58.18m → 56.89m → 59.88m PB → 59.81m
Final standings:
🥇 Feng Bin — 63.69m
🥈 Jiang Zhichao — 62.25m
🥉 Insaeng —…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 28, 2026