నిర్మాతగా నిత్యామీనన్
నిత్యామీనన్ పేరులో ‘మీనన్’ అనే అక్షరాలను చూసి అంతా ఆమెను మలయాళీ అనుకుంటారు. కానీ నిజానికి ఆమె కర్ణాటక అమ్మాయి. అయితే.. బహుభాషా కోవిదురాలు. మాతృభాషతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషలను కూడా తను అనర్గళంగా మాట్లాడగలదు. అందుకే, భాషలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్నారు నిత్యామీనన్. నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిత్యా..
తాజాగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ‘క్యూరీ ప్రొడక్షన్స్’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి, ఓ చిత్రాన్ని నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ ‘ఇతర భాషలు నేర్చుకోవడం నాకిష్టం. మొత్తంగా ఆరు భాషలు సరళంగా మాట్లాడగలను. తాజాగా సైగల భాష కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. అది యూనివర్సల్ కదా’ అంటూ అందంగా నవ్వారు నిత్యామీనన్. ఆమె బాలీవుడ్లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్’ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

