Patlolla karthik reddy | బహదూర్‌గూడ రైతులు భూమి మాది.. మేం దున్నుకుంటున్నం.. అని చాలా రోజుల నుంచి హక్కుల కోసం పోరాటం చేస్తున్నరని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పాల్గొన్నపట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..నిన్న ది ప్యారడైజ్ సినిమా చూశామా..? ఆ సినిమాకు మా బహదూర్ గూడకు తేడా లేకుండా పోయింది. సినిమాలో వాళ్లమే మా హక్కులు మాకియ్యండి.. మా గుర్తింపు ఇయ్యండని కొట్లాడుతరు. మా భూమి కోసం మా భూమి మాదని గుర్తించడని కొట్లాడుతున్నం… బుల్లెట్ ట్రైన్ కోసం ఏ 40-50 ఎకరాలో అవసరముంటది.. 1000 ఎకరాలు పడ్తదా..? సరే రోజూ పండ్లు, పూలు, గులాబీ తోటల్లో పని చేస్తున్న మా రైతుల భూముల మీద కన్నుపడ్దది. మరి పక్కన కేఎల్ఆర్ భూమి ఉన్నది.. అక్కడ కన్ను పడ్తలేదు.. ఎందుకో..? ఆ ల్యాండ్ మన బహదూర్‌గూడలో లేదా..? KLR భూమి నుండి బుల్లెట్ ట్రైన్ పోదా.. మన దాంట్లో నుండే పోతుందా బుల్లెట్ ట్రైన్ అని ప్రశ్నించారు. మనదే కనిపిస్తదా..? పేదోళ్ల పొట్ట కొట్టాలే.. పెద్దోళ్లను మాత్రం కాపాడాలే అని ఫైర్ అయ్యారు. హైడ్రా అదే పని చేస్తున్నదని మండిపడ్డారు.
ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బుల్లెట్ ట్రైన్ అంటున్నడు.. మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. బరాబర్ బుల్లెట్ ట్రైన్ కావాలి.. మన నియోజకవర్గంలో మెట్రో రైలు తీసుకొచ్చిందెవరు కేసీఆర్ కాదా.. అని ప్రశ్నించారు. దీన్ని మనం వ్యతిరేకిస్తలేం.. ఎంత అవసరమో గంతే తీసుకోండి అంటున్నం. న్యాయమైన భూమి మాదెక్కడ ఉందో పట్టాలిచ్చి ఆ తర్వాత మాట్లాడు అంటున్నం. కానీ అక్రమంగా భూములు గుంజుకుంటం. అవసరం లేకపోయినా అకారణంగా ఎన్నెకరాలైన గుంజుకుంటమంటే మేం బరాబర్ కొట్లాడుతం.. చూసుకుంట ఊరుకోం.. ఇక్కడ నేనున్నా. హైడ్రా రంగనాథ్ వచ్చి అక్రమార్కుల దగ్గర నుండి తిరిగి తీసుకున్నామని చెబుతున్నారు.. మా రైతులు మీకు అక్రమార్కుల లాగా కనిపిస్తున్నారా..? మేము హైకోర్టుకి పోయి బహదూర్‌గూడ రైతులకు రిలీఫ్ తీసుకువచ్చామన్నారు.
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది
సినిమాలో వాళ్లు గుర్తింపు కోసం కొట్లాడారు, ఇక్కడ రైతులు వాళ్ల భూమి కోసం కోట్లాడుతున్నారు
– బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తీక్ రెడ్డి https://t.co/tnQyS0qqw3 pic.twitter.com/sY9mz2cp5r
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి