షూటింగ్‌కి గ్రీన్‌సిగ్నల్?
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్నదనే వార్త బయటకు రాగానే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం ఏపీ రాజధాని అమరావతిలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా నిర్వహించారు.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్నదనే వార్త బయటకు రాగానే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం ఏపీ రాజధాని అమరావతిలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా నిర్వహించారు. బాలయ్య ‘దాదా’ సినిమా షూటింగ్ బిజీగా ఉండటంతో ఈ విలువైన సమయాన్నంతా స్క్రిప్ట్‌కే కేటాయించారు కొరటాల. ఎట్టకేలకు బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఇటీవలే బాలకృష్ణకు డైలాగ్ వెర్షన్‌తో సహా స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించారట. బాలకృష్ణ కూడా స్క్రిప్ట్ విని, షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నదని వినికిడి.
కొరటాల హీరోలను చూపించే తీరు భిన్నంగా ఉంటుంది. అలాగే ఆయన సినిమాల్లో.. కథ కంటే కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తొస్తుంది. ఏ ప్రాంతంలో అయితే కథ నడుస్తుందో ఆ ప్రాంతపు జీవన శైలిని బలంగా చూపిస్తారాయన. బాలయ్యతో చేయబోతున్న సినిమా నేపథ్యం కూడా బలంగా ఉంటుందని తెలిసింది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల తెలియాల్సివుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
షూటింగ్‌కి గ్రీన్‌సిగ్నల్?
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Sheraz Mehdi | ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన షెరాజ్ మెహదీ
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

