15 Deer Killed By Dogs | కుక్కల దాడిలో 15 జింకలు మృతి.. నలుగురు అటవీ శాఖ సిబ్బంది సస్పెండ్
15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
రాయ్‌పూర్: వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. (15 Deer Killed By Dogs) ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అంబికాపూర్‌లోని సంజయ్ వన్ వాటికను అటవీ శాఖ నిర్వహిస్తున్నది. చిన్న జూ మాదిరిగా ఉండే ఈ వనంలో పలు రకాల జింకలు ఉన్నాయి. వీటిని చూసేందుకు సందర్శకులు వస్తుంటారు.
కాగా, శనివారం తెల్లవారుజామున జింకల ఎన్‌క్లోజర్‌లోకి ఐదారు వీధి కుక్కలు చొరబడ్డాయి. అక్కడి జింకలపై దాడి చేశాయి. దీంతో మచ్చల జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల దుప్పిలతో సహా పద్నాలుగు జింకలు శనివారం మరణించాయి. కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడిన ఒక జింక ఆదివారం చనిపోయింది.
మరోవైపు కుక్కల దాడి వల్ల 15 జింకలు చనిపోయినట్లు సుర్గుజా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) అభిషేక్ జోగావత్ తెలిపారు. నిబంధనల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక డిప్యూటీ రేంజర్, ముగ్గురు ఫారెస్ట్ గార్డులతో సహా నలుగురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
అంబికాపూర్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అభిషేక్ జోగావత్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Also Read:
Man Kills Wife Over Dowry | నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం.. కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
Watch: ఖరీదైన కారుతో రోడ్డుపై స్టంట్లు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

