Pakala Srihari Rao | స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో యువతకు భవిష్యత్తుకు భద్రత : పాకాల శ్రీహరిరావు
Pakala Srihari Rao | ఉద్యోగాల కోసం యువత తపన: ఇటీవల HYDRAA ప్రకటించిన కేవలం 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది యువకులు తెల్లవారకముందే లైన్లలో నిల్చున్న తీరు రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను స్పష్టంగా చూపుతోందన్నారు.
Pakala Srihari Rao | రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు భవిష్యత్తు భద్రత కల్పించవచ్చని, మన రాష్ట్రానికి ఇంతవరకు ముద్ర రుణాలు తక్కువగా మంజూరు చేసినందున, కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రంలోని బ్యాంకులకు అదనంగా 71 లక్షల ముద్రా రుణాల టార్గెట్ సాధించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం యువత తపన: ఇటీవల HYDRAA ప్రకటించిన కేవలం 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది యువకులు తెల్లవారకముందే లైన్లలో నిల్చున్న తీరు రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను స్పష్టంగా చూపుతోందన్నారు.
రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోయినా, స్వయం ఉపాధికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో 71 లక్షల ముద్రా రుణాలు తక్కువగా మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి జాతీయ సగటుకు సమానంగా ముద్రా రుణాల టార్గెట్ మన రాష్ట్రంలోని బ్యాంకులకు అదనంగా ఇప్పించాలని, దీని వల్ల చదువుకున్న యువత ₹10 లక్షల వరకు పూచీకత్తు లేకుండ తక్కువ వడ్డీకి రుణాలు పొంది మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారు.
ఈ రుణాల ద్వారా వీధి వ్యాపారులు, పండ్లు, కూరగాయలు అమ్మేవారు డైలీ, వీక్లీ ఫైనాన్సర్ల భారీ వడ్డీ బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరుతుందన్నారు.
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

