మొయినాబాద్ : మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )కి బిగ్ షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకమామిడి శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొలిగిద్ద సత్యనారాయణ సోదరుడు బొలిగిద్ద జగదీష్ బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి( MLA Sabhita Indrareddy ) సమక్షంలో వారు బీఆర్ఎస్ లో చేరారు. వారితో పాటు ముగ్గురు వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు చేరిలో వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, అమలు చేయకపోవడంతో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్లో చేరుతున్నారని వెల్లడించారు.
ప్రజా పాలనలో ప్రజా సంక్షేమానికి తావు లేక రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు మొర శ్రీనివాస్, సీనియర్ నాయకులు రవి యాదవ్, సుధాకర్ యాదవ్, అంజయ్య గౌడ్, ఎండీ బిలాల్, సునీల్ కుమార్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.