Om Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ విభజన అనివార్యం.. నాలుగు రాష్ట్రాలుగా విభజించాలి: మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్
Om Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనివార్యమని ఆయన తెలిపారు. త్వరలోనే నాలుగు రాష్ట్రాలుగా విడిపోతుందని చెప్పారు. ‘పూర్వాంచల్’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, రాజ్‌భర్ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనివార్యమని ఆయన తెలిపారు. త్వరలోనే నాలుగు రాష్ట్రాలుగా విడిపోతుందని చెప్పారు. ‘పూర్వాంచల్’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, రాజ్‌భర్ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. (Om Prakash Rajbhar) సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్, సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ‘పూర్వాంచల్’ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న తన డిమాండ్‌ను ఆయన మరోసారి ప్రస్తావించారు.
కాగా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని తమ సామాజిక వర్గం జనాభా, ఓట్ల వాటా గురించి ఓం ప్రకాష్ రాజ్‌భర్ మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన అనివార్యం. పూర్వాంచల్, మధ్యాంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ వంటి ప్రాంతాలతో రాష్ట్రాన్ని విభజించాలి. అంబేద్కర్ నగర్ మొదలుకొని మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం వరకు చూస్తే, మొత్తం పూర్వాంచల్ ప్రాంతంలో రాజ్‌భర్ సామాజిక వర్గమే అత్యధిక ఓట్ల వాటా కలిగి ఉంది. కాబట్టి పొత్తు పెట్టుకునే ఏ పార్టీ అయినా, భవిష్యత్తులో ఏర్పడే పూర్వాంచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్‌భర్ సామాజిక వర్గానికి చెందినవారే అయి ఉండాలన్న షరతును ముందుగానే నిర్ణయించాలి’ అని అన్నారు.
మరోవైపు ఈ కార్యక్రమం అనంతరం పలు మీడియా సంస్థలతో కూడా మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించడం అనివార్యమని స్పష్టం చేశారు. త్వరలోనే ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా ఎన్నికల పొత్తుల విషయంలో ప్రతిపాదిత ‘పూర్వాంచల్’ రాష్ట్రానికి రాజ్‌భర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే ముఖ్యమంత్రిని చేయాలన్నది రాజీ లేని షరతు అని రాజ్‌భర్ అన్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే ప్రతిపాదనపై ఆ రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నది. తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రాంతాన్ని ‘పూర్వాంచల్’గా, మధ్య ప్రాంతాన్ని ‘మధ్యాంచల్’ లేదా ‘అవధ్ ప్రదేశ్’గా, దక్షిణ ప్రాంతాన్ని ‘బుందేల్‌ఖండ్’గా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాన్ని ‘హరిత్ ప్రదేశ్’ లేదా ‘పశ్చిమ ప్రదేశ్’గా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు, స్థానిక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర విభజన అంశం మరోసారి తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
“Uttar Pradesh will be divided in four parts in coming days.
Rajbhar’s ‘son’ will be chief minister if ‘Purvanchal’ becomes a separate state.”
– UP Minister Om Prakash Rajbhar
Instead of strengthening his poor organisation this man continues with his controversial statements. pic.twitter.com/EMYbwYCIZF
— News Arena India (@NewsArenaIndia) September 21, 2026
#WATCH | Ambedkar Nagar, Uttar Pradesh: State Minister Om Prakash Rajbhar says, “The division of the state is inevitable. When the state is divided—encompassing regions like Purvanchal, Madhyanchal, Bundelkhand, and Harit Pradesh—if you look at the area where we are currently… pic.twitter.com/fnzWPFfTg7
— ANI (@ANI) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

