Ganya Thanda | చిలిపిచెడ్, సెప్టెంబర్ 21 : మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గన్యా తండా గ్రామపంచాయతీకి సంబంధించిన 204 భూముల పట్టాల సమస్యపై గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.
204 భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కలెక్టర్ కోరారు. ఈ భూములకు పట్టాలు లభిస్తే రైతులు తమ పంటలను తామే విక్రయించుకోవడంతోపాటు రైతు బంధు, రైతు బీమా, యూరియా, ఇతర ప్రభుత్వ వ్యవసాయ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని రైతులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
గ్రామ ప్రజల సమస్యను కలెక్టర్ సానుకూలంగా విని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 204 భూముల పట్టాల సమస్య పరిష్కారం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం త్వరలో ఫలించాలని గన్యా తండా గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం