Khammam Victim | కేసీఆర్ అన్నీ బాగు చేస్తే.. కాంగ్రెస్ రాగానే ఇండ్లు కూల్చేస్తున్నారు.. ఖమ్మం కూల్చివేతల బాధితురాలు
Khammam Victim | కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చి, రోడ్లు వేస్తే.. కాంగ్రెస్ రాగానే ఇండ్లు కూల్చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
Khammam Victim | ఖమ్మంలో పేదల ఇళ్లపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి పంజా విసురుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నాకు కూడా దిగారు. కాంగ్రెస్ సర్కార్ తమ ఇల్లును కూల్చేస్తుందని ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో ఓ బాధిత కుటుంబానికి చెందిన యువతి కన్నీళ్లు పెట్టుకుంది.
శ్రీనివాసనగర్‌లో బాధితురాలు మాట్లాడుతూ.. కనీసం ఇల్లు ఉంటే అయినా బాగుండేది.. ఏదైనా కష్టం చేసుకుని బతుకుతం. ఇల్లు లేకపోతే మేమెక్కడికని వెళ్తం. గతంలో మాకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మా దగ్గరకు ఇలా ఎవరూ రాలేదు.. వాళ్లే ఇంటి పట్టా కూడా ఇచ్చారు కదా.. రోడ్లు వేశారు.. అన్ని సౌకర్యాలు కల్పించారు. నాన్న చనిపోయాడు, అమ్మకు మూగ, చెవుడు.. ఇప్పుడు ఇల్లును కూల్చేస్తామని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చి, రోడ్లు వేస్తే.. కాంగ్రెస్ రాగానే ఇండ్లు కూల్చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇల్లును కూల్చేస్తుందని కన్నీళ్లు పెట్టుకున్న యువతి
నాన్న చనిపోయాడు, అమ్మకు మూగ, చెవుడు.. ఇప్పుడు ఇల్లును కూల్చేస్తామని అంటున్నారు
కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చి, రోడ్లు వేస్తే.. కాంగ్రెస్ రాగానే ఇండ్లు కూల్చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం… https://t.co/lTrUhWlj6x pic.twitter.com/jFQbSmXyv7
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2026
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

