IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
IFFI 2026 | గోవా వేదికగా జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో భారతీయ సినిమా సత్తా చాటింది. నవంబర్ 20 నుంచి 28 వరకు 'స్టోరీస్ వితౌట్ బోర్డర్స్' (Stories Without Borders) అనే థీమ్‌తో ఘనంగా జరిగిన ఈ వేడుక శనివారం ముగింపు ఉత్సవాలతో ముగిసింది.
గోవా వేదికగా జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో భారతీయ సినిమా సత్తా చాటింది. నవంబర్ 20 నుంచి 28 వరకు ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ (Stories Without Borders) అనే థీమ్‌తో ఘనంగా జరిగిన ఈ వేడుక శనివారం ముగింపు ఉత్సవాలతో ముగిసింది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా (Silver Peacock for Best Actor – Male) అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించారు. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రంలో అద్భుత నటనకు గాను రిషబ్ శెట్టికి ఈ గౌరవం దక్కింది. అంతేకాకుండా, ఇదే చిత్రానికి జ్యూరీ నుంచి ‘స్పెషల్ మెన్షన్’ పురస్కారం కూడా లభించింది. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు భారతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) చిత్రానికి గాను విశాల్ చతుర్వేది ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (Best Debut Director) అవార్డును కైవసం చేసుకున్నారు. సంస్కృతి, విశ్వాసం, సంగీతంతో పాటు బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు జ్యూరీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 7, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతుండగా, నేటి (నవంబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.
ఇక అంతర్జాతీయ విభాగంలో పోర్చుగల్-ఫ్రాన్స్ సంయుక్త చిత్రం ‘ఆక్’ (Aqu) ఉత్తమ చిత్రంగా ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును గెలుచుకుంది. టియాగో గ్యూడెస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘విజిటేషన్’ చిత్రానికి గాను వోల్కర్ ష్లోన్డార్ఫ్ ఉత్తమ దర్శకుడిగా, ‘ది మెల్ట్‌డౌన్’ చిత్రానికి మాయా ఓ’రూర్కే ఉత్తమ నటిగా సిల్వర్ పీకాక్ అవార్డులను అందుకున్నారు.
ఇఫీ 2026 విజేతల పూర్తి జాబితా:
ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్): ఆక్ (పోర్చుగల్-ఫ్రాన్స్) – దర్శకుడు: టియాగో గ్యూడెస్
ఉత్తమ దర్శకుడు (సిల్వర్ పీకాక్): వోల్కర్ ష్లోన్డార్ఫ్ (విజిటేషన్)
ఉత్తమ నటుడు (సిల్వర్ పీకాక్): రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)
ఉత్తమ నటి (సిల్వర్ పీకాక్): మాయా ఓ’రూర్కే (ది మెల్ట్‌డౌన్)
ఉత్తమ తొలి చిత్రం (సిల్వర్ పీకాక్): ది గోల్డెన్ ఏజ్ – దర్శకుడు: బ్రెంజర్ థౌయిన్
స్పెషల్ జ్యూరీ అవార్డు (సిల్వర్ పీకాక్): ది రివర్ ట్రైన్
స్పెషల్ మెన్షన్: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఇండియన్ ఫీచర్ ఫిల్మ్): విశాల్ చతుర్వేది (హనుమాన్ అంశ్)
ఉత్తమ వెబ్ సిరీస్ (OTT అవార్డు): మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ – దర్శకుడు: రాబీ గ్రేవాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

