Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
Nani | సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల మధ్య ఏర్పడే స్నేహాలు ఒక్కోసారి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఏర్పడిన పరిచయాలు, అనుబంధాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే కొనసాగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్, నేచురల్ స్టార్ నాని మధ్య ఉన్న అలాంటి ఓ ప్రత్యేకమైన స్నేహబంధం బయటపడింది
Nani | సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల మధ్య ఏర్పడే స్నేహాలు ఒక్కోసారి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఏర్పడిన పరిచయాలు, అనుబంధాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే కొనసాగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్, నేచురల్ స్టార్ నాని మధ్య ఉన్న అలాంటి ఓ ప్రత్యేకమైన స్నేహబంధం బయటపడింది. ‘అలియాస్ రుక్మిణీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ స్వయంగా నానికి గొడుగు పట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సరదా సంఘటన వెనుక ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికరమైన కథ ఉందని నాని వెల్లడించారు.
నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమా షూటింగ్ సమయంలో నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పటికి నాని ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టారు. నితిన్, నాని ఇద్దరూ దాదాపు ఒకే వయసు వారు కావడంతో అప్పట్లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే నాని షూటింగ్ సమయంలో నితిన్‌ను అందరిలా ‘బాబు’ అని కాకుండా నేరుగా పేరుతో పిలిచేవారట. అయితే కొత్తగా వచ్చిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ హీరోను పేరుతో పిలవడం అప్పటి ప్రొడక్షన్ మేనేజర్‌కు నచ్చలేదట. దీంతో నానిని పిలిచి హీరోను గౌరవంగా ‘బాబు’ అని పిలవాలని గట్టిగా మందలించారట. ప్రొడక్షన్ మేనేజర్ తిట్టడంతో నాని ఆ తర్వాత నితిన్‌ను ‘బాబు.. షాట్ రెడీ’ అని పిలిచారట. తనను ఎప్పుడూ పేరుతో పిలిచే నాని ఒక్కసారిగా పిలుపు మార్చడంతో నితిన్‌కు అనుమానం వచ్చిందట. అసలు ఏమైందని అడగ్గా, ప్రొడక్షన్ మేనేజర్ తనను తిట్టిన విషయం నాని చెప్పారు.
ఇది విన్న నితిన్ వెంటనే స్పందిస్తూ.. నాని తనను మళ్లీ పేరుతో పిలిచే వరకు షాట్‌కు రానని అక్కడే కూర్చుండిపోయారట. అంతేకాదు, ఆ ప్రొడక్షన్ మేనేజర్‌కు మరింత కోపం తెప్పించేలా ఏదైనా చేయాలని సరదాగా అడిగారట. అప్పుడు నాని భుజంపై చేయి వేసుకుని నడవాలని, తనకు గొడుగు పట్టాలని చిలిపి సలహాలు ఇచ్చారట. నాని చెప్పినట్లుగానే నితిన్ షూటింగ్ సెట్లో అందరి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నానికి గొడుగు పట్టారట. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారని నాని గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో ప్రొడక్షన్ మేనేజర్‌కు కూడా షాక్ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికీ తామిద్దరం ఒకరినొకరు సరదాగా ‘బాబు’ అని పిలుచుకుంటామని నాని వెల్లడించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే గొడుగు సీన్‌ను ‘అలియాస్ రుక్మిణీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై నితిన్ మరోసారి రిపీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రశంసిస్తున్నారు.సాధారణంగా సినిమా సెట్స్‌లో హీరోలకు, జూనియర్ టెక్నీషియన్లకు మధ్య హోదాల పరంగా కొంత దూరం కనిపిస్తుంది. కానీ కెరీర్ ప్రారంభంలోనే నితిన్ చూపించిన ఆ స్నేహభావం, గౌరవం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు నాని అసిస్టెంట్‌గా పనిచేసిన సినిమా సెట్లో ఏర్పడిన పరిచయం.. ఇప్పుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తూ నితిన్ హీరోగా నటించే సినిమా వరకు రావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
Stampede | తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి.. సురక్షితంగా ఎలా బయట పడాలి..?
Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
IND vs NZ | భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న కివీస్.. 243 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

