Hitman murders woman | కొడుకు హత్యకు కిరాయి హంతకుడ్ని నియమించిన మహిళ.. ఆమెను హత్య చేసి డబ్బుతో పరార్
Hitman murders woman | ఆస్తి వివాదం నేపథ్యంలో పెద్ద కుమారుడ్ని చంపాలని అతడి తల్లి ప్లాన్ చేసింది. కిరాయి హంతకుడ్ని నియమించింది. అయితే అతడు ఆ మహిళనే హత్య చేశాడు. పది లక్షల డబ్బు, నగలు దోచుకుని పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాయ్‌పూర్: ఆస్తి వివాదం నేపథ్యంలో పెద్ద కుమారుడ్ని చంపాలని అతడి తల్లి ప్లాన్ చేసింది. కిరాయి హంతకుడ్ని నియమించింది. అయితే అతడు ఆ మహిళనే హత్య చేశాడు. పది లక్షల డబ్బు, నగలు దోచుకుని పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Hitman murders woman) 2021లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నివసించే ఒక కుటుంబంలో ఆస్తి వివాదం మొదలైంది. దీంతో శకుంతల యాదవ్, తన చిన్న కొడుకు అమిత్ యాదవ్‌తో కలిసి తన పెద్ద కొడుకును చంపడానికి ప్లాన్ వేసింది. వారికి తెలిసిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు మిశ్రాను నియమించుకున్నారు. పెద్ద కుమారుడి హత్య కోసం రూ. 4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అతడికి అడ్వాన్స్‌గా లక్ష చెల్లించారు.
కాగా, ఆ డబ్బు తీసుకున్న మిశ్రా తన గ్రామానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శకుంతల, ఆమె చిన్న కొడుకు అమిత్ చివరకు అతడ్ని గుర్తించారు. పెద్ద కుమారుడ్ని హత్య చేయకపోవడంతో అడ్వాన్స్‌గా ఇచ్చిన లక్ష తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి ఇంటికి వచ్చి ఆ డబ్బు ఇస్తానని అతడు హామీ ఇచ్చాడు.
మరోవైపు కొన్ని రోజుల తర్వాత రాయ్‌పూర్‌కు మిశ్రా చేరుకున్నాడు. సహచరుడు కేతన్ తివారీతో కలిసి శకుంతల ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. దీంతో ఇద్దరూ కలిసి తాడుతో శకుంతల గొంతునొక్కి హత్య చేశారు. ఆ ఇంట్లో ఉన్న పది లక్షల డబ్బు, బంగారు నగలు దోచుకుని పారిపోయారు.
కాగా, శకుంతల హత్య, ఆ ఇంట్లో దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడైన మిశ్రా పోలీసుల గప్పి పలు ప్రాంతాల్లో తిరిగాడు. మొబైల్ ఫోన్ వాడలేదు. పాన్, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలను ఉపయోగించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పలు ప్రాంతాలు మారుతూ 2022లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. నరోడా ప్రాంతంలో అతడు స్థిరపడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా జీవిస్తున్నాడు.
మరోవైపు, మిశ్రా గురించి సమాచారం అందుకున్న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులో ఐదేళ్లుగా పోలీసుల కళ్లగప్పి అతడు తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ కేసులోని ఇతర నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Kills Wife Over Dowry | నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం.. కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
fake Aadhaar card scheme | బాలికలను హోటల్‌కు తీసుకెళ్లేందుకు యత్నం.. ముగ్గురు అరెస్ట్
Watch: ఖరీదైన కారుతో రోడ్డుపై స్టంట్లు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

