fake Aadhaar card scheme | బాలికలను హోటల్‌కు తీసుకెళ్లేందుకు యత్నం.. ముగ్గురు అరెస్ట్
fake Aadhaar card scheme | మైనర్ బాలికలను మేజర్లుగా నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఆ బాలికలను హోటల్‌కు తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్: మైనర్ బాలికలను మేజర్లుగా నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఆ బాలికలను హోటల్‌కు తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (fake Aadhaar card scheme) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. వాస్నా ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలతో పరిచయం పెంచుకున్నారు. వారిని ఆకట్టుకుని పలుచోట్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించారు.
కాగా, ఆ యువకులు మైనర్ బాలికలను హోటల్‌కు ఆహ్వానించారు. హోటల్లో బస కోసం వారు వయోజనులుగా పేర్కొంటూ తప్పుడు వయస్సు, తప్పుడు వివరాలతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ముగ్గురు యువకులు ముగ్గురు బాలికలను తీసుకుని హాటల్‌కు ప్రయాణమయ్యారు.
మరోవైపు బాలికలకు తెలిసిన వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ యువకులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను రక్షించారు. నిందితులను అమీర్ అలీ షేక్, మహమ్మద్ సిరాజ్ సల్మానీ, అల్తాబ్ అలీ అన్సారీగా పోలీసులు గుర్తించారు.
అయితే పరారీలో ఉన్న నాల్గవ నిందితుడు అరవింద్ చౌహాన్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నలుగురు నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్లతోపాటు ఫోర్జరీ, మోసానికి సంబంధించిన ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Ghaziabad Spy Case | ఘజియాబాద్ గూఢచర్యం కేసులో.. పోలీసుల అదుపులో 9 మంది మైనర్లు
Life Imprisonment | వైద్యురాలిని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి.. జీవిత ఖైదు శిక్ష విధించిన కోర్టు
Watch: గ్యాస్ కొరత నేపథ్యంలో.. గ్యాస్ సిలిండర్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

