Pallaburusu | కొడుకుపై కేసు వేసిన తండ్రి .. తెలంగాణ పల్లె నేపథ్యంలో ఆసక్తికరంగా ‘పళ్లబురుసు’ ట్రైలర్
Pallaburusu | ‘లెనిన్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన విలేజ్ కామెడీ డ్రామా ‘పళ్లబురుసు’ ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Pallaburusu | ‘లెనిన్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన విలేజ్ కామెడీ డ్రామా ‘పళ్లబురుసు’ ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘పళ్లబురుసు’ ట్రైలర్ ఒక వినూత్నమైన కామెడీ కాన్సెప్ట్‌తో ప్రారంభమవుతుంది. తనకు పళ్లబురుసు (టూత్ బ్రష్) కొనివ్వలేదని ఓ తండ్రి సొంత కొడుకుపైనే కేసు వేయడం కథలో ప్రధాన ట్విస్ట్‌గా కనిపిస్తోంది. అప్పుల భారంతో సతమతమవుతున్న కొడుకు, చిన్న కోరిక కూడా తీర్చలేక తండ్రితో గొడవపడటం.. ఆ చిన్న గొడవ క్రమంగా పెద్ద వివాదంగా మారి కోర్టు వరకు వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది.
కేవలం హాస్యమే కాకుండా తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను కూడా ట్రైలర్లో హృదయానికి హత్తుకునేలా చూపించారు. కుటుంబానికి దూరమైన తండ్రి.. మళ్లీ తన కొడుకుతో కలవాలని తపనపడటం.. మరోవైపు కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే కొడుకు మనస్తత్వాన్ని దర్శకుడు భావోద్వేగంగా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. అందమైన తెలంగాణ పల్లె వాతావరణం, గ్రామంలోని వృద్ధుల సరదా సంభాషణలు, యువ జంట ప్రేమకథ, స్థానిక సంస్కృతి, యాస, భాష ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ‘బలగం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మచా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆదిత్య శెట్టి, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి జీవనశైలి, సహజమైన పాత్రలు, వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలను మేళవించిన ‘పళ్లబురుసు’ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌కు లభిస్తున్న స్పందనను బట్టి చూస్తే, ఈ చిన్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

