Ghaziabad Spy Case | ఘజియాబాద్ గూఢచర్యం కేసులో.. పోలీసుల అదుపులో 9 మంది మైనర్లు
Ghaziabad Spy Case | గూఢచర్యం కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి 9 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ వ్యక్తులు వారికి మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు.
లక్నో: గూఢచర్యం కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి 9 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ వ్యక్తులు వారికి మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. (Ghaziabad Spy Case) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌తోపాటు భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ప్రదేశాలలో సౌరశక్తితో పనిచేసే, సిమ్ ఆధారిత సీసీటీవీ కెమెరాలను గుర్తించారు. రెండు కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, భద్రతా పరంగా కలకలం రేపిన గూఢచర్యం ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. మార్చి 14న ఘజియాబాద్ పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరింత దర్యాప్తు తర్వాత తొమ్మిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని జువెనైల్ జస్టిస్ హోమ్‌కు తరలించారు.
మరోవైపు వ్యూహాత్మక ప్రదేశాలలో సౌరశక్తితో పనిచేసే సిమ్ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయమని ఒక విదేశీ హ్యాండ్లర్ నిందితులకు మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని ఘజియాబాద్ అదనపు కమిషనర్ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. నిందితుల వ్యూహాలు, వారు అందుకున్న నిధులు, విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలపై సిట్ మరింతగా దర్యాప్తు చేస్తున్నదని అన్నారు.
Also Read:
Life Imprisonment | వైద్యురాలిని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి.. జీవిత ఖైదు శిక్ష విధించిన కోర్టు
Karnataka Officer Dies by Suicide | సీనియర్ వేధింపులు తాళలేక.. అధికారి ఆత్మహత్య
Ramadoss, Sasikala join hands | తమిళనాడులో కొత్త రాజకీయ కూటమి.. చేతులు కలిపిన రామదాస్, శశికళ
Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

