Life Imprisonment | వైద్యురాలిని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి.. జీవిత ఖైదు శిక్ష విధించిన కోర్టు
Life Imprisonment | వైద్యురాలిని కత్తెరతో పొడిచి దారుణంగా చంపిన వ్యక్తికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితుడ్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అయితే అతడికి మరణశిక్ష విధించాలని కోరిన ప్రాసిక్యూషన్ వినతిని కోర్టు తిరస్కరించింది.
తిరువనంతపురం: వైద్యురాలిని కత్తెరతో పొడిచి దారుణంగా చంపిన వ్యక్తికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితుడ్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అయితే అతడికి మరణశిక్ష విధించాలని కోరిన ప్రాసిక్యూషన్ వినతిని కోర్టు తిరస్కరించింది. (Life Imprisonment) కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2023 మే 10న తెల్లవారుజామున టీచర్ అయిన సందీప్ తన ప్రాణానికి ప్రమాదం ఉన్నదంటూ అత్యవసర నంబర్‌కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. స్థానికులతో గొడవ కారణంగా అతడి కాలుకు గాయడం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, గాయానికి కట్టుకడుతున్న డాక్టర్ వందనా దాస్‌పై సందీప్ అనూహ్యంగా దాడి చేశాడు. ట్రేలో ఉన్న కత్తెర తీసుకుని 27 సార్లు ఆమెను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన యువ వైద్యురాలిని తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మరోవైపు నిందితుడైన సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యతో పాటు వైద్య సిబ్బందిపై దాడి చట్టంతో సహా పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. కొల్లాం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మూడేళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపింది. బాధిత వైద్యురాలి కుటుంబంతో పాటు ప్రాసిక్యూషన్ నిందితుడికి మరణ శిక్ష విధించాలని కోర్టును అభ్యర్థించారు.
కాగా, మార్చి 17న నిందితుడు సందీప్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. మార్చి 21న శిక్షలు ఖరారు చేసింది. అన్ని నేర సెక్షన్లకు గాను మొత్తం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ శిక్షాకాలం పూర్తి చేశాక వైద్యురాలి హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష మొదలవుతుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు అనూహ్యమైన తీర్పు ఇచ్చింది.
అయితే బాధిత వైద్యురాలి కుటుంబంతో పాటు ప్రాసిక్యూషన్ ఈ శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడికి మరణ శిక్ష కోసం ఉన్నత కోర్టులో అపీల్ చేస్తామని పేర్కొన్నారు.
Also Read:
Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Karnataka Officer Dies by Suicide | సీనియర్ వేధింపులు తాళలేక.. అధికారి ఆత్మహత్య
Ramadoss, Sasikala join hands | తమిళనాడులో కొత్త రాజకీయ కూటమి.. చేతులు కలిపిన రామదాస్, శశికళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

