US vs Iran | మాపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారింది : ఇరాన్
US vs Iran | అమెరికా (USA) తరచూ తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్నదని, మాపై ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి (Iran Foreign Ministry Spokesperson) ఇస్మాయిల్ బఘాయీ (Esmaeil Baghaei) విమర్శించారు.
US vs Iran : అమెరికా (USA) తరచూ తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్నదని, మాపై ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి (Iran Foreign Ministry Spokesperson) ఇస్మాయిల్ బఘాయీ (Esmaeil Baghaei) విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్ను ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి (US Treasury Secretary) స్కాట్ బెసెంట్ (Scott Bessent) చెప్పడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడల్లా అమెరికా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.
లక్ష్యాలు అందుకోలేకపోతే ఆంక్షల తీవ్రత మరింత పెంచుతోందని బఘాయి విమర్శించారు. ఇది ఒక అలవాటుగా, చివరకు వ్యసనంగా మారిందని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని బఘాయీ స్పష్టంచేశారు. దశాబ్దాలుగా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పారు. అమెరికా నేతలు ఈ చెడు అలవాటును కొనసాగిస్తే.. సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడే అవకాశాలను వారే దెబ్బతీసుకుంటారని హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్వర్క్లపై ఆధారపడుతోందని స్కాట్ బెసెంట్ ఆరోపించారు. వారి అక్రమ ఆర్థిక నెట్వర్క్లను గుర్తించి ధ్వంసం చేస్తామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

