Vikarabad | వికారాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొని తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.