Snake Bite | ఆరుగురు విద్యార్థినులను కాటువేసిన పాము.. ముగ్గురు మృతి
Snake Bite | మహారాష్ట్రలోని ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక పాము ఆరుగురు విద్యార్థినులను కాటు వేసింది. వీరిలో ముగ్గురు మరణించారు. ఒకరిని హెలికాప్టర్ ద్వారా నాగపూర్ హాస్పిటల్కు తరలించారు.
Snake Bite | మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని జప్తలై (Japtalai) గ్రామంలో ఒక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినుల పాము కాటు వేసింది. వీరిని దగ్గరలోని ధనోరా గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గడ్చిరోలి జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపి చికిత్స అందిస్తుండగా ముగ్గురు మరణించారు. ఒకరి పరిస్థితి విషయంగా ఉండటంతో హెలికాప్టర్ ద్వారా నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
గడ్చిరోలి జిల్లా ఇన్చార్జి మంత్రి (Incharge Minister) ఆశిష్ జైస్తాల్ పాఠశాలకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను రక్షించేందుకు పోలీసులు, జిల్లా అధికారులు వైద్యాధికారులతో మాట్లాడుతున్నారు. మరణించిన విద్యార్థినుల వయసు 8, 12, 14 సంవత్సరాలు. పాఠశాల యాజమాన్యంపై ప్రజలు, విద్యార్థినుల తల్లిదండ్రలు తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

