దేవరకొండ రూరల్, ఆగస్టు 10 : దేవరకొండ రూరల్ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ మాల్గడ్డ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో హుండీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై దేవస్థానం కమిటీ సభ్యులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు అందజేశారు.