TG-TMARS : తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ట్రాపిక్ మేనేజ్మెంట్, రైల్ సేఫ్టీ బ్యూరోను తీసుకొచ్చింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ చూసుకోనుంది. ఈ బ్యూరో వ్యవహారాలను చూసుకునేందుకు అదనపు డీజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం టీజీ- టీమార్స్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 33 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ వింగ్స్ నిర్వహణను టీమార్స్ పర్యవేక్షించనుంది. ట్రాఫిక్ నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్, రహదారులపై పెట్రోలింగ్, ప్రమాదాల దర్యాప్తు వంటి కీలక బాధ్యతలు చూసుకోనుందీ బ్యూరో.
ట్రాఫిక్ యూనిట్స్, నిబంధనల ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ .. సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం.. రాంగ్ రూట్ డ్రైవింగ్, లేన్ ఉల్లంఘన, ఓవర్ లోడింగ్.. వంటివాటిపై టీమార్స్ దృష్టి సారించనుంది. అలానే.. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డుపై మార్కింగ్స్, రోడ్డు భద్రతా గుర్తులు ఏర్పాటు చేయడం కూడా ఈ బ్యూరో విధుల్లో ఓ భాగమని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో 32,000 కిలోమీటర్ల రోడ్లు, రిజిష్టర్ అయిన వాహనాలు 1.8 కోట్లు ఉన్నాయని సమాచారం.
Telangana sets up a dedicated Traffic Management, Road and Rail Safety Bureau, TG-TMARS, under the State Police.
Headed by an ADGP or IG, it will oversee traffic enforcement, e-challans, highway patrols, road-crash investigation and prosecution across the State, while also… pic.twitter.com/OfwWq4mweT
— Telugu360 (@Telugu360) September 24, 2026