న్యూఢిల్లీ : ఎలాంటి పాల పదార్థాలను ఉపయోగించకుండానే పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న క్రమంలో దీనికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. సారూప్యతతో ఉన్న పాలేతర ఉత్పత్తులలో ‘పనీర్’ పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించడానికి భారత అహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఒక ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేసింది.
దీని ప్రకారం పాలేతర ప్రత్యామ్నాయ బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లో ‘పనీర్’ పదాన్ని ఉపయోగించడం నిషేధం. హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ నూనెలు, పిండి పదార్ధాలు, స్టార్చ్‌లు, పాలేతర ప్రొటీన్లతో తయారు చేసిన చౌకైన అనలాగ్ నకిలీ ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అసలైన పాలపనీర్గా విక్రయిస్తూ వాణిజ్యపరమైన ఆహార మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ చర్యకు దిగింది.