KCR : కాంగ్రెస్ పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు జపిస్తున్నారు. పండుగలు, వేడుకల్లో.. కేసీఆర్ పాటలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలోనే వినాయక చవితి సందర్భంగా డీజేల్లో గులాబీ బాస్ పాటలు వింటూ.. పాడుతూ హుషారుగా స్టెప్పులేస్తున్నారు. జనంలో కేసీఆర్కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తోంది. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ.. జై కేసీఆర్ అన్నందుకు తనపై కేసు పెట్టారని వాపోయింది.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పేరును, ఆయన ఆనావాళ్లను చెరిపేసేందుకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ ఈసారి పోలీస్ కేసులకు తెరతీసింది. వినాయక నిమజ్జనం సమయంలో జనం కేసీఆర్ పాటలు వినడాన్ని భరించలేక కేసులు పెడుతోంది. ట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా జై కేసీఆర్ అన్నందుకు తన మీద కేసు పెట్టారని ట్రాన్స్జెండర్ శృతి యాదవ్ వాపోయింది. ‘ఇదెక్కడి అన్యాయం? ఇదేమి సర్కార్?’ అని ఆమె రేవంత్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది.
ట్యాంక్ బండ్ మీద జై కేసీఆర్ అన్నందుకు కేసు
ట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా జై కేసీఆర్ అన్నందుకు తన మీద కేసు పెట్టారని అంటున్న ట్రాన్స్జెండర్ శృతి యాదవ్ pic.twitter.com/C0opzqPaQk
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026